![]() |
![]() |

బుల్లితెర మీద సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన 9 కంటెస్టెంట్ రీతూ - డెమోన్ పవన్ బాగా ట్రోల్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఏ షో కైనా ఎక్కడికైనా ఒకరు లేకుండా ఒకరు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు డెమోన్ పవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఒక సుదీర్ఘ పోస్ట్ ని రీతూ గురించి పెట్టాడు. "రీతూ గురించి వెనక మాట్లాడే వాళ్ళ కోసమే ఇదంతా చెప్తున్నా...జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నాన్నను కోల్పోవడం చాలా పెద్ద విషయం. పాస్ట్ లో బ్రేకప్ అవ్వడం బాధాకరమైన విషయం. ఇన్ని జరిగిన ఆమె తన ఫామిలీ కోసం మళ్ళీ లేచి నిలబడింది. ఆమె ఎవరి మీద డిపెండ్ కాలేదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ ఒకవేళ ఆమె మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ ఆమె గురించిన నెగటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయకండి.

చాలామంది ఆమె మీద రూమర్స్, నెగటివిటీ, బాడ్ కామెంట్స్ సిల్లీగా పాస్ చేసేస్తున్నారు. ఆమె ఏదైనా బెస్ట్ గా చేయాలనుకుంటుంది ఆమె ఎవరికీ చెడు చేయలేదు. ఆమె ఎన్ని కష్టాలు పడినా తన స్ట్రాంగ్ మైండ్ సెట్ తో అన్నింటికీ దూరంగా వచ్చి తన పని తానూ చేసుకుంటోంది. దేవుడి మీద భక్తితో తన మీద తానె గొప్ప నమ్మకంతో ఆమె చాల కష్టపడుతుంది తన ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడింది. ఆమె చాల స్ట్రాంగ్, మెచ్యూర్ గా ఉంటుంది, జెన్యూన్ గా కేరింగ్ గ చూసుకుంటుంది. మనసులో మాత్రం చిన్నపిల్లలా ఉంటుంది. నేను ఆమె దగ్గర నుంచి చాల విషయాలు నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాను. నాకు ఆమె ఒక బిగ్ ఇన్స్పిరేషన్ " అంటూ చాలా ఘాటుగా ట్రోలర్స్ కోసం పెట్టాడు డెమోన్ పవన్.
![]() |
![]() |